సాయుధ పోరాటాన్ని వక్రీకరిస్తున్న బీజేపీ
తెలంగాణ సాయుధ పోరాటాన్ని బిజెపి వక్రీకరిస్తున్నదని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి ఆరోపించారు. ఈ నెల 11 నుండి 17 వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా సీపీఐ దేవరకొండ మండల సమితి ఆధ్వర్యంలో మండల వ్యాప్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా పోరాటంలో భాగస్వాములైన అమరుల స్మారక స్తూపాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.