నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గ వ్యాప్తంగా శనివారం ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. ఏకధాటిగా కురిసిన వర్షానికి దేవరకొండ పట్టణంలో రోడ్లు, వీధులు జలమయమయ్యాయి. ఇక దేవరకొండలోని ప్రభుత్వ ప్రాథమిక ఉర్దూ మీడియం పాఠశాల ఆవరణ నీటికుంటను తలపించింది. తరగతి గదుల్లోకి వరకు వర్షపు నీరు చేరడంతో విద్యార్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.