
దేవరకొండ: రంజాన్ వేడుకల్లో ఎమ్మెల్యే
దేవరకొండ: అల్లా ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే బాలు నాయక్ అన్నారు. సోమవారం రంజాన్ పండుగ సందర్భంగా పట్టణ శివారులోని ఈద్గా వద్ద ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిరాజ్ ఖాన్, ఆలంపల్లి, దేవేందర్ నాయక్, వేణుధర్ రెడ్డి, పల్లా, పున్న, యునుస్, సురేష్ గౌడ్, శ్రేశైలం యాదవ్ ఈద్గా కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.