విద్యాలయాల సమీపంలోని కోళ్ల ఫారం ను తొలగించండి: ఏబీవీపీ

83பார்த்தது
విద్యాలయాల సమీపంలోని కోళ్ల ఫారం ను తొలగించండి: ఏబీవీపీ
దేవరకొండ: పట్టణ శివారులోని మోడల్ స్కూల్, ట్రైబల్ వెల్ఫేర్, కస్తూర్బా గాంధీ విద్యాలయాల సమీపంలో నిర్మించిన కోళ్ల ఫారంను తక్షణమే తొలగించాలని కోరుతూ గురువారం ఏబీవీపీ ఆధ్వర్యంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. కోళ్ల ఫారం నుండి వచ్చే దుర్వాసనతో విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నారని వినతిపత్రాల్లో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గోపీచంద్, శ్రీకాంత్, తులసి, దివ్య, అక్షయ, పవిత్ర తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி