అంతర్రాష్ట్ర బైక్ దొంగ అరెస్ట్
చెడు వ్యసనాలకు బానిసై ఈజీగా డబ్బు సంబంధించే దారిని వెతుక్కుంటూ బైకులను దొంగతనం చేసి, ఆ డబ్బుతో జల్సాలకు పాల్పడుతున్న ఏపీ మాచర్లకు చెందిన రాజా అనే అంతరాష్ట్ర బైక్ దొంగను కొండమల్లేపల్లి పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపారు. శుక్రవారం కొండమల్లేపల్లి ఎస్సై రామ్మూర్తి తెలిపిన వివరాల ప్రకారం అర్ధరాత్రి సమయాలలో రెండు పల్సర్ బైక్ లను కొట్టేశాడని, సీసీ కెమెరాల ద్వారా నిందితుని గుర్తించడం జరిగింది అని తెలిపారు.