TG: ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నుండి 26 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుని, BRSLPని విలీనం చేసుకుని ప్రతిపక్ష పార్టీ లేకుండా చేసుకోవాలన్న పట్టుదలతో సీఎం రేవంత్ ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించాడు. ఇప్పటికే 10 మందిని పార్టీలోకి లాగారు. మరో 16 ఎమ్మెల్యేల కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడంలేదు. అక్టోబర్ 9వ తేదీలోగా 16 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకుంటే BRSLP వీలినం అవుతుంది. లేదంటే పార్టీలో చేరిన 10 మందికి డేంజర్ బెల్స్ మోగినట్లే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.