వాహనాల వేలానికి భారీ స్పందన
నల్గొండ జిల్లా దేవరకొండ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలకు నిర్వహించిన వేలంపాటకు భారీ స్పందన వచ్చింది. మంగళవారం ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం 7, 45, 000 రూపాయల విలువగల 12 వాహనాలకు వేలంపాట నిర్వహించగా 9, 72, 000 రూపాయలు వచ్చాయని, 1, 74, 960 రూపాయలు జీఎస్టీ ద్వారా వచ్చాయని సీఐ తెలిపారు.