AP: రాష్ట్రంలో గిరిజనులకు డోలీ కష్టాలు తప్పడం లేదు. సరైన రోడ్డు, రవాణా సదుపాయం లేకపోవడంతో ఓ నిండు గర్భిణీని కుటుంబ సభ్యులు నాలుగు కిలో మీటర్లు డోలీలో మోసుకెళ్లారు. ఆస్పత్రిలో జాయిన్ చేయించారు. ఈ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా మూలపేట పంచాయతీ పరిధిలోని జాజులబంధలో చోటు చేసుకుంది. తమ గ్రామానికి రోడ్డు మార్గం ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు.