
కలెక్టర్ కు మందమర్రి జిఎం శుభాకాంక్షలు
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని జిల్లా ఉన్నతాధికారులకు సింగరేణి మందమర్రి ఏరియా జిఎం దేవేందర్ శుభాకాంక్షలు తెలిపారు. శనివారం మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ ను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతో పాటు జీఎం కార్యాలయ అధికారులు ఉన్నారు.