మందమర్రి మండలంలోని ఎర్ర చెరువును అభివృద్ధిలోకి తీసుకురావాలని బహుజన్ సమాజ్ పార్టీ చెన్నూర్ నియోజకవర్గ అధ్యక్షులు మల్కల్ల రాజేంద్రప్రసాద్ డిమాండ్ చేశారు. గురువారం మందమర్రి ఇరిగేషన్ శాఖ డీఈ శారదకు ఆయన వినతిపత్రం అందజేశారు. చెరువు అభివృద్ధి కోసం ప్రభుత్వం కొనుగోలు చేసిన భూముల హద్దులు గుర్తించి ట్రించ్ ఏర్పాటు చేయాలని, ఆయకట్టు రైతులకు నీరందించాలని తెలిపారు.