భీమారం మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మంచిర్యాల చున్నంబట్టి వాడకి చెందిన కొండ గొర్ల దేవక్క, వాణిలకు గాయాలైనట్లు ఎస్సై శ్వేత తెలిపారు. చెన్నూరు నుంచి మంచిర్యాల వైపు కారు వెళుతుండగా ఎదురుగా వస్తున్న కంకర లోడ్ టిప్పర్ ను వేగంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వారిద్దరికీ గాయాలైనట్లు పేర్కొన్నారు. ప్రమాదంపై కేసు దర్యాప్తు చేసినట్లు ఎస్సై తెలిపారు.