జైపూర్ మండలంలోని వేలాల కిష్టాపూర్ శివారులోని గోదావరి నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నట్లు ఎస్సై శ్రీధర్ తెలిపారు. కిష్టాపూర్ గ్రామానికి చెందిన దుర్గా గౌడ్, మునీందర్, వేలాలకు చెందిన సంతోష్, శివారం చెందిన మల్లేష్ ల మీద కేసు నమోదు చేశామని వెల్లడించారు.