చర్ల: ఇన్ఫార్మర్ నెపంతో హత్య
ఇన్ఫార్మర్ నెపంతో మావోయిస్టులు ఛత్తీస్ గఢ్ ఓ గ్రామస్థుడిని హత్య చేశారు. పోచనపల్లికి చెందిన తాటి కన్నయ్య(55)ను ఇటీవల అపహరించుకుపోయిన మావోయిస్టులు పదునైన ఆయుధంతో అతనిని హత్య చేశారు. మృతదేహాన్ని మంగళవారం దుబ్బపర-పోచన్నపల్లి దారిలోని పాత పాఠశాల భవనం సమీపంలో పడేశారు. కన్నయ్య 2008 నుంచి పోలీసులకు ఇన్ఫార్మర్ వ్యవహరించిన కారణంతోనే హత్య చేసినట్లు సంఘటనా స్థలంలో మావోయిస్టులు వదిలి వెళ్లిన లేఖలో పేర్కొన్నారు.