ఎగువ ప్రాంతంలో భారీగా కురుస్తున్న వర్షాలకు చర్ల మండలంలోని తాలిపేరు దోబూచులాడుతోంది. జలాశయంలో మంగళవారం తెల్లవారుజామున 1. 70 లక్షల క్యూసెక్కుల మేర ఇన్ వచ్చి చేరింది. 9 గంటలకు 46, 769 క్యూసెక్కులకు తగ్గింది. జలాశయానికి వస్తున్న వరద ఉద్ధృతి క్రమేణా తగ్గుముఖం పట్టగా దిగువ గోదావరి వేగంగా పెరుగుతుండటంతో తాలిపేరుకు ఎగపోటు వేసింది. లోతట్టు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు మైకుల ద్వారా ప్రచారం చేశారు.