అల్పపీడన ప్రభావంతో ఛతీస్ ఘడ్ తో పాటు స్థానికంగా కురుస్తున్న భారీ వర్షాలకు చర్ల మండంలోని తాలిపేరు ప్రాజెక్టుకు సోమవారం భారీగా వరద నీరు పోటెత్తింది. ఎగువ ఛతీస్ ఘడ్ లోని దంతెవాడ, బీజాపూర్ జిల్లాల్లో కుండపోత వానలకు జలాశయంలోకి ఉదృతంగా వరద నీరు చేరింది. దీంతో ప్రాజెక్టులో 24 గేట్లను పూర్తిస్థాయి (ఫ్రీఫ్లో)లో ఎత్తి వుంచి 1. 54 లక్షల క్యూసెక్కుల చొప్పున వరద నీటిని దిగువ గోదావరికి విడుదల చేస్తున్నారు.