థాయ్‌లాండ్‌లో ఓ స్కూల్ టీచర్ 66 మంది విద్యార్థులకు బట్టతల వచ్చినట్లుగా గుండు చేశాడు. ఆ విద్యార్థులు స్కూల్ హెయిర్ పాలసీని ఉల్లంఘించినందుకు ఈ శిక్ష వేసినట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. ఈ క్రమంలో సదరు టీచర్ విద్యార్థులను తుపాకీతో బెదిరించాడని కూడా వెల్లడించాయి. ఈ చర్య సరికాదని పేర్కొంటూ అధికారులు అతడిని తొలగించారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా, ఆ విద్యార్థులకు ఉచితంగా హెయిర్ కట్ చేశారని పలువురు కామెంట్ చేస్తున్నారు.