యాకుత్‌పురా - Yakutpura

రేపు తప్పని ట్రాఫిక్ ఇబ్బందులు

రేపు తప్పని ట్రాఫిక్ ఇబ్బందులు

తొమ్మిది రోజుల పాటు ఘనంగా పూజలు అందుకున్న గణనాథుడు.. గంగ ఒడిలోకి చేరే సమయం ఆసన్నమైంది. ఈ క్రమంలో హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఈనెల 17, 18వ తేదీల్లో పోలీసులు భారీగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మొత్తం 64 చోట్ల ట్రాఫిక్ డైవర్షన్స్ ఏర్పాటు చేశారు. ఈ మేరకు ట్రాఫిక్ అడిషనల్ పోలీస్ కమిషనర్ విశ్వప్రసాద్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ట్యాంక్ బండ్ దగ్గర 8 చోట్ల పార్కింగ్ సదుపాయం కల్పించినట్లు తెలిపారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని పేర్కొన్నారు. శోభయాత్ర మొదలైన రెండు గంటల్లోనే ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం పూర్తి చేస్తామని తెలిపారు. నిమజ్జనాలు, ట్రాఫిక్ ఆంక్షల నేపథ్యంలో సిటీలోకి భారీ వాహనాలకు పర్మిషన్ లేదని తేల్చి చెప్పారు.

வீடியோஸ்


హైదరాబాద్