తెలంగాణలో సురాపానకంగా బావించే తెల్లకల్లు ఆరోగ్యానికి దివ్య ఔషధంగా పని చేస్తుందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ తెలిపారు. శనివారం భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం సింగారం గ్రామంలోని తాటివనంలో ఆయన తాటికల్లు సేవించారు. ప్రకృతి సిద్దంగా లభించే తెల్లకల్లును ప్రతి ఒక్కరు సేవించడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉంటాయన్నారు. తెల్లకల్లు అనేక వ్యాధులకు ఔషధంగా పనిచేస్తుందన్నారు.