భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం పలుగుల గ్రామపంచాయతీ పరిది ఎస్సీ కాలనీ సమీపంలో పులి ప్రత్యక్షమైంది. బుధవారం ఓ ఇసుక లారీ డ్రైవర్లు చూసి గ్రామస్తులకు తెలపడంతో, గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందజేశారు. పులి పాదముద్రలు గుర్తించి పులి కోసం వెతుకుతున్నారు. అటవీ శాఖ అధికారులు మగపులిగా గుర్తించారు. సుమారు దాని వయసు మూడున్నర సంవత్సరాల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.