భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బుధవారం రాత్రి హత్యకు గురైన మాజీ కౌన్సిలర్ భర్త రాజ లింగమూర్తి హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తన భర్తను చంపించింది బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి అని లింగమూర్తి భార్య ఆరోపిస్తున్నారు. 'నేను గ్యారంటీగా చెప్తున్నా నా భర్తను హత్య చేసింది వాడే' అంటూ రోడ్డుపై తీవ్ర స్థాయిలో రోదిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.