AP: వైసీపీ అధికారంలో ఉన్నా.. లేకపోయినా ప్రజల పక్షాన పోరాడుతుందని ఆ పార్టీ నేత కన్నబాబు స్పష్టం చేశారు. ఆదివారం విశాఖలో ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను మడత పెట్టి బీరువాలో పెట్టిందని విమర్శించారు. అవి చంద్రన్న పగ, దగ పథకాలు మాత్రమేనని అన్నారు. గ్రూప్-2 పరీక్షలకు సంబంధించి యువత రోడ్డెక్కితే పట్టించుకోలేదన్నారు. అసలైన యువగళం ఎలా ఉంటుందో పాలకులకు తెలుస్తుందన్నారు.