ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్ శాఖ అధికారులు పెద్ద ఎత్తున పాములను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు ప్రయాణికులు బ్యాంకాక్ నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. ఈ క్రమంలో వారు అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో వారి లగేజీని తనిఖీ చేశారు. వారి బ్యాగుల్లో అనేక రకాలు పాములు, కీటకాలు లభ్యమవడంతో వెంటనే అదుపులోకి తీసుకున్నారు.