భూపాలపల్లి జిల్లా గణపురం మండలం మాధవరావుపల్లి కాలనీలో గత రెండు రోజుల నుండి పండుగ వాతావరణంలో శ్రీలక్ష్మీ, భూలక్ష్మీ (బొడ్రాయి) విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. కాగా, బుధవారం జరిగిన ప్రతిష్ఠాపన మహోత్సవంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొన్నారు. బొడ్రాయి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. తల్లి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు.