AP: సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి హెచ్చరించారు. విశాఖకు చెందిన యూట్యూబర్ లోకల్ బాయ్ నానిపై అందిన ఫిర్యాదుల మేరకు అతడిని అరెస్ట్ చేసినట్లు పేర్కొంది. మెజిస్ట్రేట్ ముందు నానిని హాజరుపర్చగా రిమాండ్ విధించినట్లు వెల్లడించారు.