మస్తాన్‌సాయి లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. విజయవాడకు చెందిన లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. మస్తాన్ సాయిని 3 రోజలు పాటు పోలీసులు విచారించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. హార్డ్ డిస్క్‌లో 2500కు పైగా ఫొటోలు, 499కు పైగా ప్రైవేట్ వీడియోలు, 734 ఆడియో రికార్డింగ్స్‌ను పోలీసులు గుర్తించారు. అయితే ఎక్కువగా లావణ్యతోపాటు మస్తాన్ ప్రేయసి, తన భార్యకు సంబంధించిన వీడియోలు ఉన్నట్లు తెలుస్తోంది.