భూపాల్ పల్లి జిల్లా ఆజంనగర్ గ్రామంలో ఫారెస్ట్ అధికారులు రైతులపై చేసిన దాడిని గురువారం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ ఖండించారు. గత 40 ఏళ్లుగా సాగుచేసుకుంటున్న భూములపై ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యం ఏంటని ప్రశ్నించారు. ఆజంనగర్ లో 150 మంది ఫారెస్ట్ అధికారులు, సిబ్బంది కలిసి 50 మంది రైతులను విచక్షణారహితంగా కొట్టి, స్పృహ తప్పిపోయేలా చేసిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.