ఇటీవల జరుగుతున్న వరుస దాడులు వరంగల్‌లో కలకలం రేపుతున్నాయి. హసన్‌పర్తి మడిపల్లిలో పెళ్లి భరాత్‌లో జరిగిన ఘర్షణతో ముగ్గురిపై కత్తితో దాడి చేశారు. వరంగల్ బట్టుపల్లిలో ఓ కారును ఆపి గుర్తు తెలియని వ్యక్తులు రాడ్లతో దాడి చేశారు. గొడవల కారణంగా వరంగల్ లో అత్త, మామ, భర్యపై ఓ భర్త కత్తితో దాడి చేశాడు. భూపాలపల్లిలో మాజీ కౌన్సిలర్ భర్తపై కత్తులతో దాడి చేసి దారుణంగా చంపేశారు. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.