ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా జరగనున్న మ్యాచ్‌లో భారత్ టాస్ ఓడగా పాకిస్థాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సంగతి తెలిసిందే. అయితే టీమిండియా టాస్ ఓడిపోవడం ఇది పన్నెండోసారి. 2023 ప్రపంచ కప్ ఫైనల్స్ నుండి భారత్ వరుసగా 12 టాస్‌లను ఓడింది. ఈ మధ్యకాలంలో వన్డేల్లో ఎక్కువ టాస్‌లు ఓడిన జట్టుగా భారత్ నిలిచింది. కాగా, నెదర్లాండ్స్ 11 టాస్‌లు ఓడి ఆ తరువాతి స్థానంలో ఉంది. కాగా, కెప్టెన్‌గా రోహిత్ టాస్ ఓడడం ఇది తొమ్మిదోసారి.