భూపాలపల్లి జిల్లా మంజూరునగర్ మైసమ్మ దేవాలయం వద్ద శుక్రవారం ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదం జరిగింది. భూపాలపల్లికి వెళ్తున్న ఎమ్మెల్యే సత్యనారాయణ రావు ప్రమాదాన్ని గమనించారు. తన వాహనం నుండి దిగి, గాయపడ్డ వ్యక్తి వివరాలు అడిగి తెలుసుకుని, 108 అంబులెన్స్ కు ఫోన్ చేసి, క్షతగాత్రుడికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని డాక్టర్ కు సూచించారు. ఆపదలో ఎమ్మెల్యే చూపిన చొరవకు అక్కడున్న స్థానికులు అభినందనలు తెలిపారు.