ఆందోలు మండలం అల్మాయిపేట గ్రామంలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేయాలని కోరుతూ ఎక్సైజ్ అధికారి సాగర్ రెడ్డికి బుధవారం వినతిపత్రం సమర్పించారు. గ్రామంలో ఉన్న బెల్టు షాపులను మూసి వేయించాలని కోరారు. గ్రామంలో బెల్ట్ షాపులు ఉంటే వెంటనే మూసివేస్తామని యువకులకు ఎక్సైజ్ అధికారి హామీ ఇచ్చారు.