ఉప్పల్ లో యువకుడు ఆత్మహత్య
18 ఏళ్ల యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం. ఉప్పల్ విజయపురి కాలనీవాసి అరూప్ రాజ్(18) ఎంసెట్ కోచింగ్ తీసుకుంటున్నాడు. ఉదయం తల్లి నిద్ర లేపడానికి గదిలోకి వెళ్ళగా ఉరి వేసుకుని కనిపించాడు. కిందికి దింపి చూసేసరికి అప్పటికే చనిపోయాడు. మంచి కాలేజీలో సీటు వస్తుందో? లేదో? అనే ఆందోళనతో ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని తండ్రి దేవ్‌రాజ్ వాపోయారు.