యువకుడు అనుమానాస్పద మృతి

70பார்த்தது
ఉప్పల్ నియోజకవర్గం ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధి రామంతపూర్ లో శివ శ్రీ డీలక్స్ బాయ్స్ హాస్టల్ లో ఉంటున్న దొంతు రాము అనే యువకుడు బుధవారం అనుమానాస్పద మృతి చెందాడు. గతంలో ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో వార్డ్ బాయ్ గా పనిచేసిన రాము, ప్రస్తుతం ఖాళీగా ఉంటూ ఉద్యోగం కోసం వెతుకుతున్నట్లు తెలిసింది. మూడు రోజుల క్రితం హాస్టల్ లో చేరినట్లు అలాగే ఎవ్వరితో కూడా మాట్లాడకుండా మౌనంగా ఉండేవాడు అని హాస్టల్ నిర్వాహకుడు తెలిపారు.

தொடர்புடைய செய்தி