కాంట్రాక్ట్ అధ్యాపకులకు సెక్యూరిటీతో కూడిన స్కేలు ఇవ్వాలి

82பார்த்தது
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని యూనివర్సిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులకు బేసిక్, డీఏ, హెచ్ఎస్ఏతో కూడిన స్కేలు అమలు చేయాలని కాంట్రాక్ట్ అధ్యాపక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. దీనికి ప్రభుత్వానికి నెలరోజుల గడువు విధించారు. లేనిపక్షంలో వర్సిటీలు స్తంభించేలా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో కాంట్రాక్ట్ అధ్యాపకుల రాష్ట్ర స్థాయి జనరల్ బాడీ సమావేశాన్ని శనివారం నిర్వహించారు.

தொடர்புடைய செய்தி