ఒక టూరిజం వెబ్‌సైట్ విడుదల చేసిన నివేదిక ప్రకారం, హోటల్ గదుల్లో అతిథులు వదిలిపెట్టే అత్యంత సాధారణ వ్యక్తిగత వస్తువుల జాబితాలో పవర్ బ్యాంక్‌లు, ఛార్జర్‌లు ముందు వరుసలో ఉన్నాయి. ఆ తర్వాత ఉతకని బట్టలు, అడాప్టర్లు, మేకప్ వస్తువులు, షాంపూ, టూత్‌పేస్ట్స్, లోదుస్తులు ఉన్నాయి. వీటిల్లో కొన్నింటిని అతిథులు ఉద్దేశపూర్వకంగా వదిలేసి వెళ్తారు. ప్రపంచవ్యాప్తంగా 400 హోటళ్ల డేటా ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు.