పెద్దపల్లి: ఏసీబీకి పట్టుబడ్డ రెవెన్యూ అధికారులు
పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండల తహశీల్దార్ రమేశ్, ఆర్ఐ శ్రీధర్ లంచం తీసుకుంటూ మంగళవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. రామగుండంకు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ మహేష్ నుంచి ఇసుక ట్రాక్టర్ విడుదల కోసం రూ. 12 వేల లంచం తీసుకుంటుండగా, ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆర్ఐ శ్రీధర్ ను పట్టుకోగా, డబ్బులు వదిలేసి పరారైనట్లు తెలుస్తోంది. అయితే ఇందుకు బాధ్యుడైన తహశీల్దార్ ను విచారించి కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు.