ఆధార్ కార్డులు జారీ చేసి ఇప్పటి వరకు 10 ఏళ్లు అవుతుంది. ఈ నేపథ్యంలో ఆధార్ కార్డు ఫ్రీగా అప్‌డేట్ చేసుకోవడానికి UIDAI ఇచ్చిన గడువు దగ్గరపడుతుంది. UIDAI తన అధికారిక వెబ్‌సైట్‌లో ప్రస్తుతం ఉచితంగా ఆధార్ కార్డ్ అప్‌డేట్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించింది. సెప్టెంబర్ 14లోపు ఆధార్‌లో తప్పులను ఉచితంగా సవరించుకొని అప్‌డేట్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ 14 తర్వాత ఆధార్ కార్డులో మీరు ఎలాంటి అప్‌డేట్‌కైనా రూ.50 రుసుము చెల్లించాల్సి ఉంటుంది.