ఐటిఐలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
పటాన్ చెరులోని ఐటీఐలో మిగిలిన సీట్లకు ప్రవేశానికి ఈ నెల 28లోపు దరఖాస్తులు కళాశాల ప్రిన్సిపల్ రాజేశ్వర రావు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులను http: //iti. telangana. gov. in వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. పదవ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.