ఏపీకి మరో అల్పపీడన ముప్పు

78பார்த்தது
ఏపీకి మరో అల్పపీడన ముప్పు
పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో బుధవారం కోస్తా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. కోస్తాలో గంటకు 30-40 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది.

தொடர்புடைய செய்தி