
మధిర: పాఠశాల విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన
ఖమ్మం జిల్లా వైద్యాధికారుల ఆదేశాల మేరకు మధిర మండల వైద్యాధికారుల ఆధ్వర్యంలో శుక్రవారం మండల కేంద్రంలోని కస్తూరిబా పాఠశాల విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా విద్యార్థులు వేసవిలో తీసుకోవలసిన ఆహార పదార్థాలు, పానీయాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారులు, పాఠశాల ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.