ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని శ్రీ మృత్యుంజయ స్వామి వారి దేవాలయ ప్రాంగణంలో మహాశివరాత్రి సందర్భంగా జరుగుతున్న వేడుకలలో గురువారం మధిర శాసన సభ్యులు, రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కుటుంబ సమేతంగా హాజరై స్వామివారికి పట్టు వస్త్రాలు అందించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి తీర్థప్రసాదాలు అందజేశారు.