ఖమ్మం జిల్లా మధిర మండలంలోని జాలిముడి ప్రాజెక్టును బుధవారం ఖమ్మం మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు ఆధ్వర్యంలో మధిర మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జాలిముడి ప్రాజెక్టు ద్వారా పంట పొలాలకు నీరు అందకపోవడంతో స్థానిక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలియజేశారు.