ఖమ్మం జిల్లా మధిర మండల పరిధిలోని రొంపిమల గ్రామంలో గల శివాలయం నందు గురువారం ఆలయ అర్చకులు శివ పార్వతుల కళ్యాణ 16 రోజుల పండుగ ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయానికి వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.