ఖమ్మం జిల్లా మధిర మండల కేంద్రంలోని నాలుగు పరీక్ష కేంద్రాలలో శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ ఆదేశాల మేరకు పదో తరగతి పరీక్షలు ప్రారంభమైనట్లు మధిర మండల విద్యాశాఖ అధికారి ప్రభాకర్ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మధిర మండల కేంద్రంలోని నాలుగు పరీక్ష కేంద్రాలలో మొత్తం 1, 049 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు.