హైదరాబాద్: దీపావళి ఎపెక్ట్... జోరందుకున్న టపాసుల విక్రయాలు
నగరంలో దీపావళి సందడి మొదలైంది. ధీపాంతులు, టపాసుల విక్రయాలు జోరందుకున్నాయి. హైదరాబాద్ లోని హాల్ సెల్ మార్కెట్ అయిన బేగంబజార్ లో టపాసుల కోసం కొనుగోలుదారులు బారులు తీరారు. క్యూ లైన్లలో నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాత్రి 7 గంటల సమయంలో రద్దీ విపరీతంగా పెరిగింది. ఈ ప్రభావంతో బేగంబజార్ నుంచి కోఠీ రూట్ లో ట్రాపిక్ జామ్ అయింది. పోలీసులు ఎప్పటికప్పుడు వాహనాల రద్దీని క్రమబద్ధీకరిస్తున్నారు.