
గోషామహల్: వక్ఫ్ బోర్డు బిల్లుపై బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు
వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు త్వరలోనే పార్లమెంట్లో ఆమోదం పొందుతుందని శనివారం కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. మజ్లిస్ పార్టీ దేశద్రోహ పార్టీయని, రాజ్యాంగానికి ముప్పు ఒవైసీలాంటి కుహానా లౌకికవాదుల నుంచే వచ్చుందని విమర్శించారు. దేశ ప్రజలు, ఆస్తులను రక్షించాల్సిన బాధ్యత తమదని, మోదీ ప్రభుత్వం జాతీయవాదంతో ముందుకు సాగుతుందని తెలిపారు. మతపరంగా బిల్లును అడ్డుకుంటే ప్రజలే తిరగబడతారని హెచ్చరించారు.