బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన సకల జనుల సర్వే రిపోర్టు ఎక్కడ అని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్కు చిత్తశుద్ధి ఉంటే వివరాలను వెల్లడించాలని మంగళవారం హైదరాబాద్ గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు. బీసీ కుల గణన పూర్తి అయ్యాక సర్పంచ్ ఎన్నికలు వస్తే బడుగు బలహీనవర్గాలకు న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు.