కలకత్తాలో వైద్యురాలిపై జరిగిన హత్యాచారంకు నిరసనగా దేశవ్యాప్తంగా వైద్యసేవలు నిలిపివేసిన డాక్టర్లు హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం మహా ధర్నా నిర్వహించారు. కలకత్తా మెడికల్ కాలేజీలో మహిళా పీజీ వైద్యురాలి పై జరిగిన అత్యాచారాన్ని ఖండిస్తున్నామని వారు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డాక్టర్లకు దేశవ్యాప్తంగా రక్షణ కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.