క్షణంలో వైరల్ గా మారిన పోస్ట్.. మీరు చూసారా?
హైదరాబాద్లో ఓ క్యాబ్ డ్రైవర్ తన కారులో ఒక పోస్టర్ ఏర్పాటు చేశాడు: "వార్నింగ్: నో రొమాన్స్. ఇది క్యాబ్, ప్రైవేట్ ప్లేస్ లేదా ఓయో కాదు." ఈ పోస్టర్ వెనుక సీట్లో కూర్చున్న వారికి స్పష్టంగా కనిపించేందుకు ఏర్పాటు చేశారు. ఇది సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో క్షణాల్లో వైరల్ అయింది. నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తూ, "అయన ఎంత చూశాడో, భరించలేక ఇలా చెప్పాడా?" అని కామెంట్ చేస్తున్నారు.