ట్రాఫిక్ నియంత్రణకు హైడ్రా నడుం బిగించింది. వాహనాల రద్దీ సమస్యతో పాటు, అక్రమ ఫుట్ పాత్, రహదారి ఆక్రమణల తొలగింపునకు ట్రాఫిక్ బృందంతో కలిసి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనుంది. రహదారులు, కాలనీల్లో ఆక్రమణల తొలగింపు, నీరు నిలిచే ప్రాంతాల సమస్యల పరిష్కారానికి బిఆర్ఎఫ్ బృందాలకు శిక్షణ అందించనుంది. అక్రమంగా ఉన్న ఫుట్పాత్, రోడ్ల పక్కన ఉన్న దుకాణాలు, చెత్త డబ్బాలు, ట్రాన్స్ఫార్మర్లను సైతం తొలగించనున్నారు.