అభివృద్ది పనులను సకాలంలో పూర్తి చేయాలని అధికారులకు ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రేహ్మాత్ బెగ్ ఆదేశించారు. ఆదివారం సులేమాన్ నగర్ డివిజన్ పరిధిలోని గోల్డెన్ హైట్స్ కాలనీలో అధికారులతో కలిసి ఎమ్మెల్సీ పర్యటించారు. స్థానికంగా కొనసాగుతున్న అభివృద్ది పనులను పరిశీలించారు. త్వరగా పనులను పూర్తి చేయాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ నవాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.